Dr. A. V. SUBRAHMANYAM
"Some are born great, some achieve greatness, and some have greatness thrust upon them"
William Shakespeare
మనిషి వికాసానికి విద్యా, విజ్ఞానములు ప్రధానమైనవి. వాటిని సంపాదించు కోవడానికి విద్యాలయాలు కేంద్ర బిందువుగా ఉంటాయి. విద్యార్థులు విజ్ఞానవంతులు, సంస్కారవంతులు కావడానికి కావలసిన వనరులు, వాతావరణం విద్యాలయాలలో లభించాలి. అవి అన్నీ ప్రభుత్వాలే సమకూర్చలేవు. సమాజ హితాన్ని కాంక్షించే సేవాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు ఆయా బాధ్యతలను స్వీకరించాలి. కేశవ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ అలాంటి సామాజిక బాధ్యతను స్వీకరించి 1940వ సం॥ నుండి విద్యాలయాలను నడుపుతోంది. నేడు 10 విద్యాలయాలతో 14 వేల మంది విద్యార్థులతో విరాజిల్లుతోంది.
విజ్ఞాన సముపార్జనకు తగిన సాధన సంపత్తి స్వచ్ఛము, ఆహ్లాదకరమైన వాతావరణము విద్యాలయాలలో అత్యంతావశ్యకము. విద్యార్థి సమగ్ర వికాసాన్ని ప్రధానంగా భావించిన కేశవ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ నేటి విద్యావిధానానికి అనుగుణంగా కావలసిన సైన్స్ ప్రయోగశాలలను, కంప్యూటర్లను, అంతర్జాల అనగా వైఫై, ఇంటెర్నెట్, డిజిటల్ గ్రంథాలయాల వంటి వాటినెన్నింటినో విద్యార్థుల కొరకు సమకూర్చింది. పచ్చదనంతో మనోల్లాసాన్ని, కలిగిస్తూ మానసిక ఒత్తిడులను దూరం చేసే విధంగా విద్యాలయాల్లో వాతావరణాన్ని పెంపొందింప చేస్తూ వస్తోంది. లిటరరీ క్లబ్, కల్చరల్ క్లబ్ వంటి వివిధ విభాగాలల్లో విద్యార్థి సమగ్ర వికాసానికి కృషి చేస్తున్న అధ్యాపక బృందాన్ని అభినందిస్తున్నాను.
విజ్ఞానాన్ని, సంస్కారాన్ని, పౌరునిగా బాధ్యతలను నిర్వహించే వ్యక్తులను నిర్మాణం చేసే దిశలో కేశవ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ముందుకు వెడుతూ NCC, NSS వంటి విభాగాలకు పెద్ద పీట వేస్తోంది. మనిషికి జీవనోపాధి కూడ ముఖ్యమే. ఈ విద్యాలయాలలో అధ్యాపకులు తమ బోధనా సామర్థ్యంతో విద్యార్థులను స్థాయి కలిగిన వారుగా, నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దుతున్నారు, వివిధ కంపెనీల వాళ్లు ప్రతి యేటా విద్యాలయాలకు వచ్చి, వందలాది మంది విద్యార్థులను ఎంపిక చేసుకొని ఉద్యోగావకాశాలను కల్పిస్తుండటం ఎడ్యుకేషన్‌కు సొసైటీకి యెంతో గర్వ కారణం. నైపుణ్యాలను పెంపొందించే బహుముఖీనమైన విద్యా ప్రణాళికలను (Additional Courses) రూపొందించడంలో అధ్యాపకులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారడంలో సందేహం లేదు.
వివిధ విషయాలలో విశేష పరిజ్ఞానం లభించడం కోసం అనుభవజ్ఞులైన మేధావులతో Extension Lectures ఇప్పించి విద్యార్థి సమగ్ర వికాసం కోసం కృషి జరుగుతుండటం ముదావహం. విద్యా సంస్థ ప్రతిష్ఠ పెరగడం కోసం విద్యార్థులు, అధ్యాపకులు, యాజమాన్యముల సమిష్టి కృషి అత్యంతావశ్యకము. దేశాభివృద్ధికి కేశవ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సోసైటీ తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తుంది.